పంటల పరిశీలన
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:16 AM
మండలంలోని రాంపురం, కాచాపురం, నారాయణపురం గ్రామాల్లో దెబ్బతిన్న వరి,పత్తి పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సుజాతమ్మ, సతీష్, ఆదోని ఏడీఏ బాలవర్ధిరాజు, మండల వ్యవసాయ అధికారులు గణేశ్, వరప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఏవోలు గణేశ్ వరప్రపాద్ పరిశీలించారు.
మంత్రాలయం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాంపురం, కాచాపురం, నారాయణపురం గ్రామాల్లో దెబ్బతిన్న వరి,పత్తి పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సుజాతమ్మ, సతీష్, ఆదోని ఏడీఏ బాలవర్ధిరాజు, మండల వ్యవసాయ అధికారులు గణేశ్, వరప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఏవోలు గణేశ్ వరప్రపాద్ పరిశీలించారు. పంటల సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏఈవో తిరుమల రెడ్డి, ఎంపీహెచ్‌ఈవో బసవరాజు ఉన్నారు.
కోసిగి: మొంథా తుఫాన్ నేపథ్యంలో మండలంలోని తుంగభద్ర నది తీరమైన సాతనూరు, తుమ్మిగనూరు, కడిదొడ్డి, కందుకూరు, అగసనూరు గ్రామాల్లో చేతికొచ్చిన వరిపైర్లను మండల వ్యవసాయాధకారి ఎం.వరప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు డా. సుజాత, డా.వైఎస్ సతీష్ కుమార్, ఆదోని సహాయ వ్యవసాయసంచాలకుడు బాలమర్దిరాజు బుధవారం పరిశీలించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో తుంగభద్ర నది తీరంలోని వరి పైర్లు నేలబారీ నష్టం చేకూర్చింది.
ఎమ్మిగనూరు: రైతులు తాము పండించిన పత్తి పంటను ప్రైవేటు దళారీ వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దని జేడీఏ వరలక్ష్మి అన్నారు. బుధవారం ఎర్రకోట గ్రామ పరిధిలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. జేడీఏ వెంట ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీ, ఏవో శివశంకర్, గోనేగండ్ల ఏఓ హేమలత ఉన్నారు.