AP Rain Alert: భారీ వర్షాలు.. ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:59 AM
కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.
అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా ఎగువన కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. భారీ వర్షాల వల్ల కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శాఖాపరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పరిహహక ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది.
కాగా... మొంథా తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తుపాను ఎఫెక్ట్‌తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇవి కూడా చదవండి...
చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం
మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..
Read Latest AP News And Telugu News