Home » Cyber attack
సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న తరుణంలో నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల పేర్లు చెప్పి మోసాలకు తెగబడుతున్నారు.
ఇండియన్ ఆయిల్ రివార్డు పాయింట్స్ పేరుతో నగరానికి చెందిన వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ.1.28 లక్షలు కొల్లగొట్టారు.
టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.14 లక్షలు కాజేశారు. అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్ ద్వారా నగరానికి చెందిన వ్యక్తి(43)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
కూలి పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగా ళ్లు రూ.1,73,001 కాజేశారు. తొలుత సిమ్ కార్డును బ్లాక్ చేసి.. ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు.
భారీ స్థాయిలో లాగిన్ క్రెడెన్షియల్స్ లీకైనట్టు వార్తల నడుమ యూజర్లు తమ లాగిన్ వివరాలు జాగ్రత్త చేసుకునేందుకు సైబర్ భద్రత నిపుణులు కొన్ని టిప్స్‌ను సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.
సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో హనీట్రాప్ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.38.73 లక్షలు దోచేశారు. వలపు వలలో పడి తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ‘ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ.50 వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన యువకుడు (36) ఉద్యోగం మారే ప్రయత్నాల్లో తన బయోడేటాను పలువురు స్నేహితులకు పంపాడు.
మహిళా టీచర్‌తో సోషల్‌మీడియాలో స్నేహం నటించిన సైబర్ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి రూ.2.02 లక్షలు కొట్టేశాడు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్‌కు గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్ మెసేంజర్ నుంచి కాల్ వచ్చింది.