Home » Cyber attack
కాసులకు కక్కుర్తిపడి, కమీషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పులపాలైన వారిని టార్గెట్‌గా చేసుకుని వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీసు కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేక నానాతంటాలు పడుతున్నారు.
అందమైన అమ్మాయితో డేటింగ్ అంటూ నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.6.49 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మలక్‌పేట్‌కు చెందిన యువకుడు (32) మహిళలతో స్నేహం, డేటింగ్, లివింగ్ రిలేషన్ పార్టనర్ కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు.
ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
నకిలీ స్వచ్చంద సంస్థను సృష్టించి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఫొటోను పెట్టారు. రూ.లక్షల్లో రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.7.9 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫొటోను వాట్సాప్‌లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
పెన్షన్ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఇస్తామని ఏపీకే లింక్‌లు పంపిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్‌పురాలో నివసించే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ అందిస్తామన్న ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూశారు.
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నెట్ కనెక్షన్ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో వెదికిన నగరవాసి సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.1.09 లక్షలు పోగొట్టుకున్నాడు. బహదూర్‌పురాకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన యాక్ట్ ఫైబర్ సర్వీసుల కోసం ఆన్‌లైన్‌లో వెదికాడు.
టెక్ ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కొత్త బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం, ప్రముఖ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ పంపుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.