Home » Cyber attack
వాట్సాప్ డీపీ(WhatsApp DP)లో కజిన్ ఫొటో ఉండటంతో ఫోన్ చేసింది అమెరికా(America)లో ఉన్న తన అన్నయ్య అని భావించిన నగర మహిళ రూ.2 లక్షలు మోసపోయింది. నగరానికి చెందిన మహిళ(50)కు వాట్సప్ కాల్(WhatsApp call) వచ్చింది.
ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా ఏఐ డీప్‌సీక్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ ఓపెన్ ఇంటర్నెట్‌లో సున్నితమైన డేటాను భారీగా బహిర్గతం చేసిందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'విజ్' చెప్పింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మీ పేరుతో ఉన్న పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని ప్రారంభించి, మనీ లాండరింగ్ కేసుల పేరు చెప్పి, 9 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.53 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన వ్యక్తి(30)కి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది.
పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేగంగా స్పందించడం అవసరమని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) అన్నారు. డిజిటల్ మోసాలు అంశంపై ఆర్‌బీఐ అధికారులు, పోలీసుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం జరగ్గా.. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు.
Cyber Crime: టెక్నాలజీ పెరుతున్న తరుణంలో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది సైబర్ ఫ్రాడ్. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువైపోయాయి. బాధితులు మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు పలు రకాల టెక్నిక్‌లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో లోన్(Online Loan ) కోసం ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయురాలిని మభ్యపెట్టిన సైబర్ నేరగాడు(Cybercriminal) ఆమె నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేశాడు. నగరానికి చెందిన ఉపాధ్యాయురాలు (57) ఆర్థిక అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవాలని భావించింది.
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఈ విషయంలో వెంటనే అలర్ట్ అవ్వకపోతే పర్సనల్ డేటాకు హ్యాకర్ల నుంచి ముప్పు తప్పదని తేల్చి చెప్పింది..
గంటల వ్యవధిలో అరెస్ట్ చేయబోతున్నామంటూ వృద్ధ దంపతులను బెదిరించి రూ. 8 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి, టెలికాం సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు.
ఐ ఫోన్(iPhone) గిఫ్టుగా గెలుచుకున్నారంటూ ఓ యువతిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.47 లక్షలు కొట్టేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 25 ఏళ్ల యువతి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది.
యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.3.7 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు.