Home » Crime News
కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం, పోశవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల స్వగ్రామం మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట. అయితే, ఉపాధి నిమిత్తం వారిద్దరూ తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఏడేళ్ల కిందట కరీంనగర్ వావిలాలపల్లికి వెళ్లారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.
రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్‌పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
విరుదునగర్ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు.
లాల్‌దర్వాజ ఛత్రినాకకు చెందిన షకత్‌వారి శ్రవణ్ (28) పాత దొంగ. అల్లం, వెల్లుల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. తన స్నేహితులైన బీబీనగర్‌కు చెందిన కాలియారాజు, మేడ్చల్‌కు చెందిన షకత్ ముఖేంద్రతో కలిసి సులభంగా డబ్బుల సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాలు చోరీ చేస్తే యజమానులు కూడా చిన్న వాహనం అని ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని భావించి ఆ వాహనాలను చోరీచేస్తున్నారు.
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఆత్మకూర్ ప్రాంతానికి చెందిన సురేందర్ కుమారుడు నరేష్(30) అమీర్‌పేట్‌లో హాస్టల్ ఉంటూ స్థానికంగాగల దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు.
నిజాంపేట కార్పొరేషన్ రాజీవ్‌గృహకల్పలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఆటోలో వస్తున్న ఇద్దరిపై దాడి చేసి తలలు పగులగొట్టింది. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
తన ప్రమేయం లేని చోరీ కేసుల్లో పోలీసులు వద్ద తన పేరు ప్రస్తావిస్తున్నాడనే కోపంతో మనోజ్‌ను హత్య చేశానని హరిప్రసాద్ విచారణలో చెప్పినట్టు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.
తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తునాన్నరన్న అనుమానంతో తోడుబుట్టిన తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలోని వెంకటేశ్వర క్యాంప్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.