Home » Crime News
కట్టుకున్న భర్తను, అతడి తల్లి (అత్త)ని చంపేసేందుకు భోజనంలో విషం పెట్టిందో ఇల్లాలు. తన వివాహేతర బంధానికి ఆ ఇద్దరూ అడ్డుగా ఉన్నారని భావించే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఓ వ్యక్తి తనను తాను అనాథనని చెప్పుకొని.. ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు! కొన్ని నెలల తర్వాత అతడు అనాథ కాదని, అతడు చెప్పుకొంటున్న పేరూ వేరని, మతం కూడా వేరని తెలియడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు దర్యాప్తు చేపట్టారు.
అస్సాంలోని హైలాకండి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యంత ఘోరమైన స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్ నంబర్లను హ్యాక్ చేసి.. ఆ నంబర్ నుంచి తెలిసినవారికి, వాట్సాప్ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య అతన్ని హత్య చేసింది. ఆపై ఓ పాడుబడిన ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టింది. రెండేళ్లుగా భర్త ఆస్ట్రేలియాలో ఉంటున్నాడని, మాట్లాడటం కుదరదని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మిస్తూ వచ్చింది.
కడపజిల్లా ప్రొద్దుటూరు పరిధిలో గురువారం టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గు రు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.
అమెరికాలో యూ వీసా పొందేందుకు నకిలీ దోపిడీలకు పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మసాచుసెట్స్‌కు చెందిన మితుల్ పటేల్ ఈ మోసానికి పాల్పడటంతో బోస్టన్‌లోని ఫెడరల్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన వదిన తలను గొడ్డలితో నరికేశాడు.
థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్ నుంచి దేశం విడిచి పారిపోవడానికి యత్నిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.