Share News

Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్

ABN , Publish Date - Dec 25 , 2025 | 10:32 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాల సంఖ్య తగ్గిపోయింది.. గల్ కల్చర్‌కు చెక్ పెట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన గంటల వ్యవధిలోనే అలీఘర్‌లోని ఏఎంయూలో ఓ ఉపాధ్యాయుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్
Shooting Incident at AMU

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradsh) దారుణ ఘటన చోటు చేసుకుంది. బుధవారం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం(AMU)లో కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. ఏబీకే బాయ్స్ స్కూల్‌లో కంప్యూటర్ టీచర్‌(Computer teacher)గా పనిచేస్తున్న రావు డానిష్ అలీపై ముసుగు ధరించిన కొందరు దుండగులు పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపారు. ఏఎంయూ లైబ్రరీ క్యాంటిన్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని జెన్ మెడికల్ కాలేజ్ కి తరలించారు.. చికిత్స పొందుతూ మృతి చెందారు.


గత 11 ఏళ్ల నుంచి క్యాంపస్‌లోని ఏబీకే హైస్కూల్లో కంప్యూటర్ సైన్స్ బోధిస్తున్నాడు డానిష్ అలీ. బుధవారం రాత్రి తన సహ ఉద్యోగులతో నడుచుకుంటూ వెళ్తున్నాడు డానిష్ రావు. ఆ సమయంలో స్కూటర్‌పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు వారిని ఆపి.. గన్స్‌తో బెదిరించారు. రావు తలపై మూడు సార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

Read Latest National News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 11:03 AM