Home » Cricket news
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు.
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాదానికి తీవ్ర గాయమైంది. ఆ గాయంతోనే తర్వాతి రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్ అర్ధశతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్‌కు దిగాల్సిన అవసరం రాలేదు. గాయం కారణంగా ప్రస్తుత సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు పంత్ దూరమయ్యాడు.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తరువాత టీమిండియాలో భారీ మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది రిషభ్ పంత్ సంపాదన భారీగా పెరిగింది. ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్ట్, ఎండార్స్‌మెంట్లో పంత్ నికర సంపద భారీ స్థాయిలో ఉంది. ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా పంత్ నిలిచాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఫీట్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంత్‌ను చూస్తుంటే 2002 నాటి అనిల్ కుంబ్లే గుర్తుకు వస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
తన కెరీర్ నుంచి పూర్తిగా తుడిచి పెట్టాలనుకునే ఒకే ఒక అధ్యాయం శ్రీశాంత్‌తో వివాదమని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ విషయంలో శ్రీశాంత్ కూతురి మాటలు తన గుండెను ఛిద్రం చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ అఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. టీమిండియాకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం పాకిస్థాన్, భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
రోహిత్ సారథ్యంలోని టీమిండియా టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. టెస్ట్ క్రికెట్‌లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా వెళ్లింది. అయితే ఈ ఏడాది మే నెలలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వెనకబడ్డ టీమిండియాకు మాంచెస్టర్‌లో జరగనున్న నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ టెస్టుకు కుల్‌దీప్ యాదవ్‌ను రంగంలోకి దించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సూచించాడు.
లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. 2028 జులై 12 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.