Rohit Sharma: అహాన్ మొదటి బర్త్ డే.. రోహిత్ ఇంట్లో వేడుకలు.. హిట్‌మ్యాన్ ఎమోషనల్ పోస్ట్..
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:01 AM
తన కొడుకు బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. రోహిత్ కొడుకు అహాన్ శర్మ మొదటి పుట్టిన రోజు అట్టహాసంగా జరిగింది. నవంబర్ 15, 2024న జన్మించిన అహాన్ మొదటి బర్త్‌డేను రోహిత్ కుటుంబం ఘనంగా సెలబ్రేట్ చేసింది.
హిట్ మ్యాన్, భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. రోహిత్ కొడుకు అహాన్ శర్మ మొదటి పుట్టిన రోజు అట్టహాసంగా జరిగింది. నవంబర్ 15, 2024న జన్మించిన అహాన్ మొదటి బర్త్‌డేను రోహిత్ కుటుంబం ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రోహిత్, రితికా ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు (Rohit Sharma son birthday).
'మా అబ్బాయికి ఒక సంవత్సరం పూర్తయింది. సమయం ఇంత త్వరగా ఎలా గడిచిపోయిందో తెలియదు. కానీ ప్రతి క్షణాన్ని మేం చాలా ఆస్వాదించాం' అంటూ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటోను, అహాన్ బొమ్మలతో ఆడుకుంటున్న ఫొటోను, రోహిత్ భార్య రితికా, కూతురు బాల్కనీలో నిలబడి ఉన్న ఫొటోను రోహిత్ పోస్ట్ చేశాడు. అయితే ఎక్కడా అహాన్ మొహాన్ని రోహిత్ చూపించలేదు (Rohit Sharma family).
కాగా, ఇప్పటికే టెస్ట్, టీ-20 ఫార్మాట్ నుంచి రిటైరైన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తోంది (India vs South Africa). టెస్ట్ సిరీస్ ఆడుతోంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి:
తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి