Share News

IPL Auction-Shami: సన్‌రైజర్స్, లఖ్నవూ మధ్య కీలక ప్లేయర్ ట్రేడ్?

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:53 PM

ఐపీఎల్ వేలం నేపథ్యంలో ప్లేయర్‌ల ట్రేడ్స్‌కు సంబంధించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా షమీని ఎల్‌ఎస్‌జీకి ఇచ్చేందుకు సన్‌‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైందన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

IPL Auction-Shami: సన్‌రైజర్స్, లఖ్నవూ మధ్య కీలక ప్లేయర్ ట్రేడ్?
Sunrisers Hyderabad

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ఐపీఎల్ మినీ వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ జట్ల కూర్పుల్లో కీలక మార్పులకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పలు ఆటగాళ్లను ఇచ్చి పుచ్చుకునేందుకు, వదులుకునేందుకు కొన్ని ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పేసర్ మహ్మద్ షమీని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్).. లఖ్నవూ సూపర్ జెయింట్స్‌కు (ఎల్ఎస్‌జీ) ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఇది ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకొనే ట్రేడ్ కాదని సమాచారం. షమీ కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్ సుమారు రూ.10 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉందట. ఐపీఎల్ 2025 వేలంలో షమీని సన్‌రైజర్స్ సరిగ్గా ఇంతే మొత్తానికి చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, షమీ ట్రేడ్ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు (SRH Mohammed Shami).


ఈ వేలంలో తాము రిలీజ్ చేయబోయే ప్లేయర్ల జాబితాను సమర్పించేందుకు నవంబర్ 15ను బీసీసీఐ డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈలోపు కొన్ని ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల ట్రేడ్‌కు సిద్ధమయ్యాయన్న వార్తలు ఇప్పటికే అనేకం వచ్చాయి. ఆర్ఆర్‌కు చెందిన సంజూశాంసన్‌ను సీఎస్‌కే తీసుకుంటుందన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో షమీ ట్రేడ్ కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ వికెట్‌ను షమీ తీసిన ఫొటో ఎల్‌ఎస్‌జీ సోషల్ మీడియాలో కనిపించడం కూడా జనాల్లో మరింత ఉత్కంఠను కలిగించింది. ఈసారి షమీ ఎల్‌ఎస్‌జీ తరపున బరిలోకి దిగుతాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్‌లో ఎస్‌ఆర్ఎచ్ తరపున షమీ 6 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇక అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో, తాను కొంచెం క్లిష్టస్థితిలో ఉన్నానని ఇటీవల షమీ కామెంట్ చేశాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు గుడ్‌న్యూస్

ముంబై ఇండియ‌న్స్‌లోకి విధ్వంస‌క‌ర ప్లేయర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 14 , 2025 | 05:03 PM