Home » Congress
సోనియా ఆరోగ్యానికి సంబంధించి గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ గురువారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇప్పసారా అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ రభసకు దారి తీసింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన వెర్షన్ వినిపించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అధికారులు నోటీసు అందించారు. ల్యుటియన్స్ జోన్ ఖాళీ చేయాలని అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు ఇచ్చారు. అలాగే 5వ నెంబర్ రైసినా రోడ్‌లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు.
పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ప్రకటించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.