Home » CM Stalin
కరూర్‌లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్‌ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి పేర్కొన్నారు.
తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత నేత కరుణానిధిని ఆదర్శంగా తీసుకుని శ్రమించడమే కాకుండా, అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.
వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్‌న జరిగింది.
రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
స్టాలిన్ అంటేనే ‘మేన్ ఆఫ్ స్టీల్’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.