Home » CM Ramesh
రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న సాండ్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాపై దాడులు చేయాలని ఉన్నతాధికారులకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సూచించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రజలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని అనకాపల్లి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిగా చేయాలంటే తనను గెలిపించాలని కోరారు.
ఏపీ బీజేపీ కీలక నేత సీఎం రమేశ్ మనసులో మాటను బయటపెట్టారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠానానికి తన ప్రతిపాదనను విన్నవించానని, సమీకరణాలు బట్టి సాధ్యం కాకుంటే పార్టీ ఎక్కడ ఆదేశించినా పోటీకి సిద్ధమని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ప్రధాని మోదీ పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు నూతన శకానికి నాంది పలుకుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ (MP CM Ramesh) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు పార్టీల పొత్తుపెట్టుకోకుండా ఉండేందుకు కొన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నించాయని.. ఎన్నో కథనాలను ప్రచురించా యని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై చర్చ జరిగిందన్నారు.
మీడియా వల్లే బీటెక్ రవి బయట పడ్డారు. వైసీపీకి (Ycp Government) తొత్తుగా కడప ఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నా రు. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ తీవ్రంగా ఖండించారు.
కేంద్ర కేబినెట్‌లో (Union Cabinet) కొత్త నేతలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. జూలై-12న కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది...