Home » Buggana Rajendranath
Andhrapradesh: చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, జగన్ మాత్రమే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అన్నారు.
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అంతకుముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు పూజాలు నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గం డోన్‌లో నిరసన సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ డోన్ ఇంచార్జీ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ‘టీడీపీ రైతు కరువు కేక’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళనలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
అమరావతి, జనవరి 11: నాటి సీఎం చంద్రబాబుపై, నాటి ప్రభుత్వ అప్పులపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు.. అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు.. అయినా ఇప్పుడు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తరువాత కూడా అప్పులపై అవే అబద్ధాలా? వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వకపోతే జీతాలెందుకు లేటవుతున్నాయి?
టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ( Minister Buggana Rajendranath Reddy ) అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ... ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో చంద్రబాబు లోకేష్ వైసీపీ నేతలకు పేర్లు పెడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మండిపడ్డారు.
నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. తొలివిడత చర్చలు విఫలం కావడంతో మరోమారు చర్చలకు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం ఆహ్వానించింది. కార్మిక సంఘాలతో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ చర్చలు నిర్వహించనున్నారు.
Andhrapradesh: జీఎస్టీ మిత్ర, జ్ఙాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్, విజన్, మిషన్ వ్యాల్యూస్‌లను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విజన్ స్టేట్మెంట్ ఉండటం ప్రతీ వ్యవస్థకు చాలా అవసరమన్నారు. ఆర్థిక శాఖలో స్టేట్ ట్యాక్సెస్‌కు ఒక విజన్ ఇచ్చిన ఈ రోజు తన జీవితంలో మరిచిపోలేనిదన్నారు.
రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే, రెండు నెలలైనా ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.
ఆర్థిక మంత్రి బుగ్గనకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.