Home » Budget 2025
తొలి రోజు బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే సమావేశాలు ఎప్పటిదాకా కొనసాగుతాయనేది 13న జరిగే అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అత్యవసర చర్చగా విదేశాల్లో చదువుతున్న భారతీయ మెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చ జరగనుంది. మెడికల్ గ్రేడ్యుయేట్‌ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ సమాధానాలు ఇస్తారు.
మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్‌లో చేర్చనున్నట్టు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధాన సభకు ఆహ్వానిస్తున్నామనీ, బడ్జెట్‌పై వారంతా తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు.
AP Budget 2025-26 Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ.3,22,359 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రశేపెట్టిన ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేసింది.. మరి ఏ శాఖకు ఎంత కేటాయించిందో చూద్దాం..
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించనున్నారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
Daggubati Purandeswari: చట్టసభల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్న ఘనత మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. యువతకు, రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.