Share News

ABN Live: మండలిలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Feb 28 , 2025 | 10:52 AM

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించనున్నారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ABN Live: మండలిలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర
Minister Kollu Ravindra

అమరావతి: ఏపీ శాసన మండలి (AP Legislative Council)లో వార్షిక బడ్జెట్‌ (Annual Budget)ను మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ప్రవేశ పెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను (Agricultural budget) మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అసెంబ్లీలో సమర్పించనున్నారు, మండలిలో మంత్రి నారాయణ (Minister Narayana) వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా బడ్జెట్‌ సమావేశాల కంటే ముందు శుక్రవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.


కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏబీఎన్ లైవ్ చూడండి..

Updated Date - Feb 28 , 2025 | 11:14 AM