Home » Bharath
పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియాలోని 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సహయంతో, స్లీపర్ సెల్స్ సాయంతోని పెద్దఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
భారత డ్రోన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. రావల్పిండిలో భారీ నష్టం, పీఎస్‌ఎల్ రద్దు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
రష్యా తయారు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు. ఇది నాలుగు రకాల క్షిపణులతో శత్రు విమానాలు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఖచ్చితంగా తాకుతుంది.
భారత్‌పై పాక్ బుధవారం అర్ధరాత్రి రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ సకాలంలో ప్రతిస్పందించి ప్రమాదాన్ని తిప్పికొట్టింది. ప్రతిగా భారత్ పాక్‌లోని 9 నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థలపై విజృంభించింది.
భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 10-12 నౌకలు ధ్వంసమవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను తిరిగి వాయుసేన పిలిపించింది. 2027లో గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అజిత్‌తోపాటు ఇతర వైమానిక దళ అధికారులు కూడా ఎంపికయ్యారు.
పాక్‌లో బలూచీలకు విద్య, వైద్యం లేని దుస్థితి మధ్య 75 ఏళ్లుగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతోంది. తాజా దాడులతో బీఎల్‌ఏ దళాలు మరింత క్రియాశీలంగా మారాయి.