Home » Bengaluru News
కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలూకా రౌడకుందా గ్రామ సమీపంలో గల గుట్ట పై చిరుత సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన పశువులు అకస్మాత్తుగా చనిపోగా కొన్నింటి పై చిరుత దాడి జరిగినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు నగర పరిధిలోని హెణ్ణూరు థణిసంద్రలో ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది..
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ మంజూరుచేసిన హైకోర్టుపై..
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్‌ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం సదాశివనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది, చాలా కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. గురువారం నగంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్ అమ్మకాలలో కాంగ్రెస్ పార్టీలో ఉండే మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రయాంకా ఖర్గే కు సన్నిహితుడు ఒకరు ఇటీవల పోలీసులకు దొరికారాన్నరు.
మెట్రో ప్రయాణీకులకోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించడంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) రోజురోజుకూ కొత్త మైలురాళ్లు సాధిస్తోంది. అందులో భాగంగా 9కిపైగా యాప్‌లలో టిక్కెట్ లభించే సౌలభ్యం కల్పిస్తోంది.
నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
భారతినగర్ ప్రాంతంలో రౌడీషీటర్ శివప్రకాశ్ అలియాస్ బిట్లు శివ హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం రాత్రి భారతినగర్‌లో కారులో వచ్చిన వ్యక్తులు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రతిపక్షనేతగా రెండేళ్లుగా కొనసాగుతున్నా క్వార్టర్స్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని ప్రతిపక్షనేత ఆర్ అశోక్ మండిపడ్డారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ జిల్లా సిగందూరులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఖంగుతిన్న ముఖ్యమంత్రి వివాదం చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.