Home » Atchannaidu Kinjarapu
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్‌లో మంత్రుల బృందం పర్యటించనుంది.
ఏపీలో శనగల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు.
సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినా.. అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూ లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో అన్నా క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తన తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు సేకరించిన ఘనుడని సెటైర్లు గుప్పించారు.
అవినీతి డబ్బుతో జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేమూరి రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని మంత్రి తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నించిన మీడియాపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష మూలపేట పోర్టు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నవంబర్ నాటికి పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.