Home » AP Politics
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు చూసి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు డార్క్ రూమ్ పాలన చేసిన జగన్.. గొప్ప క్రెడిట్ సాధించారని మండిపడ్డారు.
ఏసీ సుబ్బారెడ్డి వారసులుగా తాము ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ హయాంలో జగనన్న లే అవుట్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నివాస యోగ్యం లేని, సముద్ర తీర భూములను కొనుగోలు చేసి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు.
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు పలువురికి శనివారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై అక్రమ కేసులు పెట్టడం, తప్పుడు సమాచారం బ్లూ మీడియాకు ఇవ్వడంపై లీగల్ నోటీసులు అందజేశారు.
వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావును సిట్ అధికారులు శనివారం హైదరాబాద్‌లో విచారించారు. నాలుగు గంటల పాటు కారుమూరిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కారుమూరిని ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు.
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు అందరూ జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పిఠాపురంలో జరిగిన ప్రొటోకాల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.