Home » AP Police
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కర్నూల్ జిల్లాలోని దేవనకొండలో దారుణం ఘటన జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు తండ్రి వీరేశ్. అనంతరం భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి భర్త వీరేశ్ ప్రయత్నించాడు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగే పోస్టుమార్టానికి వచ్చిన మృతదేహాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువ. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. మానవత్వంతో వ్యవహరించాల్సిన పోస్టుమార్టం సిబ్బంది రాబందుల్లా డబ్బు కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి ట్విస్ట్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు . నిన్న(శనివారం) తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించారు పోలీసులు. ఇవాళ(ఆదివారం) తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు.
వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలమంచిలి సురేశ్‌పై దాడి చేశారు. సురేశ్‌పై హత్యాయత్నానికి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ పాల్పడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎల్ ప్రసన్నకుమార్‌కు 2024లో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. అయితే ఇప్పుడు సదరు అధికారి అధికారిక విధుల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.