Home » AP Liquor
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కేఎన్‌ఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందనే ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు గురిపెట్టారు.
లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే పలువురు నిందితులకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావును సిట్ అధికారులు శనివారం హైదరాబాద్‌లో విచారించారు. నాలుగు గంటల పాటు కారుమూరిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కారుమూరిని ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారించారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఐఏఎస్ మాజీ అధికారి ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయా విభాగాలకు సిట్ లేఖలు రాసింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అవినాశ్ ఏ-7గా ఉన్నారు.
ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్ మైక్‌ను చూసి పరుగులు పెట్టారు. ఏబీఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కృష్ణమోహన్ రెడ్డి నీళ్లు నమిలారు.