Home » AP High Court
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్ సైన్ డైరెక్టర్ మధుసూదన్ పిటిషన్లు వేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాలు జరిపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలు
ఏపీ హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థల తరఫున వాదనలు వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
AP Mega DSC: మెగా డీఎస్సీ కొనసాగింపుపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీం విముఖత చూపించింది.
అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్‌కు సంబంధించి సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
తిరువూరు నగరపంచాయతీ ఎన్నిక సందర్భంగా కిడ్నాప్, తదితర సెక్షన్ల కింద నమోదైన నాలుగు కేసుల్లో దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని వైసీపీనేత దేవినేని అవినాశ్‌ను హైకోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా, కాకణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ ఇనుప ఖనిజ గనుల తవ్వకం, భూ కుంభకోణం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఒత్తిడితో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని, తన ఆరోగ్యం క్షీణిస్తోందని వంశీ పిటిషన్లో పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొంటూ, వారి పేర్లు తప్పుగా చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు.