• Home » AP BJP

AP BJP

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..

AP News - BJP: బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

AP News - BJP: బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇక పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తు ఖరారవ్వడం సంతోషమని వ్యాఖ్యానించారు.

AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన

AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన

TDP Joins In NDA: తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామమే చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో బీజేపీ (BJP) వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి...

Purandeswari: ఆ భవనాలను తాకట్టు పెట్టే  అధికారం జగన్‌కు ఎవరిచ్చారు

Purandeswari: ఆ భవనాలను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు

రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భస్మాసురుడు తనతలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నెత్తిన పెట్టుకున్నారని చెప్పారు.

AP BJP: హై కమాండ్‌కు ఆ జాబితాను పంపిస్తాం.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

AP BJP: హై కమాండ్‌కు ఆ జాబితాను పంపిస్తాం.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

టీడీపీ - జనసేనతో పొత్తుపై తమ హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) తెలిపారు. రెండు రోజుల పాటు బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు.

AP BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. పొత్తులపై ఏం చర్చించారంటే...?

AP BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. పొత్తులపై ఏం చర్చించారంటే...?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ బీజేపీ(BJP) పలు ప్రణాళికలను రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ పలు కసరత్తులు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోడానికి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించింది.

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

BJP First MP Candidates List: హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు..

AP Politics: ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Politics: ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

బీజేపీ(BJP) కోర్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్(Rajnath Singh) బీజేపీ నేతలకు, క్యాడర్‌కు దశా, దిశా నిర్ధేశించారు.

TDP-Janasena: ఎవరు ఎక్కడో.. అభ్యర్థుల ఎంపికల్లో ఎనలేని జాప్యం?

TDP-Janasena: ఎవరు ఎక్కడో.. అభ్యర్థుల ఎంపికల్లో ఎనలేని జాప్యం?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించడంలో చేస్తున్న జాప్యంతో ఆశావహుల్లో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాత్మక ఎత్తు గడల కారణంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి