Home » AP Assembly Sessions
కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ తరువాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ ను కామినేని కోరారు.
కేంద్రం ఎంటర్ అయ్యాక ఇల్లీగల్ మైనింగ్ ఆపారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే వందల కోట్లు జరిగిన నాటి దోపిడీని రికవరీ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.
ఛైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఛైర్మన్ ప్రొటోకాల్ విషయంలో పొరపాట్లు జరిగాయేమోననే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మార్కాపురం పట్టణానికి 8 కిలోమీటర్లు దూరంలో ఒక లే అవుట్, 10కిలో మీటర్లు దూరంలో మరో లేఅవుట్ వేశారని పేర్కొన్నారు.
10 వేల 640 కోట్ల రూపాయలు పర్యాటక రంగంలో పెట్టుబడులు తెచ్చామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పర్యాట ప్రాంతాల్లో 50 వేల గదులు ఉండాలనేది లక్ష్యమన్నారు.
వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ విషయంపై సభకు చర్చ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతూ సభను స్తంభింపచేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ ఉందంటూ ప్రభుత్వ విప్ ఎద్దేవా చేశారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
సూపర్ 6 సూపర్ హిట్‌పై అసెంబ్లీలో నేడు లఘు చర్చ జరుగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు మాట్లాడారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.