ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం సరికాదు: కేఏ పాల్
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:39 AM
‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ వ్యాఖ్యానించడం సరైనది కాదు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడకపోతే..

విజయవాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని కాపాడుకోవాలంటే జగన్ అసెంబ్లీకి వెళ్లాలి’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ వ్యాఖ్యానించడం సరైనది కాదు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేయాలి. మా పార్టీ తరఫున ఒక్క ప్రజా ప్రతినిధి లేకపోయినా రాష్ట్రంలోని అనేక సమస్యలపై పోరాడుతున్నాం’ అని పాల్ అన్నారు.