Home » AP Assembly Sessions
Minister Nara Lokesh: నాడు నేడుపై రిపోర్టు తీసుకుని యాక్షన్ తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయి ఇందులో నాణ్యత లేదన్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం 2025 -26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు.. సంక్షేమానికి నిధులు.. తదితర అంశాలపై సభలో చర్చ జరుగుతుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించనున్నారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి.
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అలాగే మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే... వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్, కేవలం పది నిమిషాలపాటు అసెంబ్లీలో డ్రామా ఆడి వెళ్లిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతు వినిపించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శాసనసభలో సవాల్ విసిరారు.
‘‘రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.2,50,000 ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వమే బీమాసంస్థలకు చెల్లిస్తుంది.
‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ వ్యాఖ్యానించడం సరైనది కాదు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడకపోతే..