Home » Andhrapradesh
క్యాలెండర్‌లో కాయితాలు చిరిగిపోతున్నాయి తప్ప, ప్రజల కడగండ్లు తీరుతున్నాయా? అధికారం చేతులు మారింది తప్ప, జీవనప్రమాణాలు పెరిగాయా? సొంత పాలనలోకి మారి ఏడు దశాబ్దాలు దాటి ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నా పల్లెలు ఈసురోమంటూనే ఉన్నాయి. సేద్యం ఒక జూదంగా మారిపోయింది.
పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది.
టేకులోడు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించింది. రైతులు సాగులో ఉన్న 600 ఎకరాల అసైన్డ్ భూములను సేకరిస్తోంది. ఎకరానికి రూ. 12,66,067లుగా ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తోంది. ఇదే అదనుగా కొందరు దళారుల అవతారం ఎత్తి అమాయక రైతులను టార్గెట్ చేస్తున్నారు.
మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు.
తల్లిపాల వారోత్సవాలు గురు వారంతో ముగిశాయి. పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. బిడ్డ ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు తాగించాలన్నారు.
అప్రకటిత విద్యుత కోతలతో మం డల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. దోమలతో చిన్నారులు, వృద్ధులు వ్యాధి బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత కోతలపై అధికారులను ప్రశ్నించినా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సత్యవతి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై బుధవారం నల్లమాడలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మండలంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. మండలంలో వైసీపీలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు బుధవారం టీడీపీ మండల నాయకులు హర్షవర్దన, గణేశ ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాల యంలో తాడిమర్రికి చెందిన బండారు నరేంద్ర, పన్నూరు నాగభూషణ, హరిజన నరసింహుడు, తలారి నారాయణస్వామితో పాటు మొత్తం 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. టీఎనఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన యాంటీ డ్రగ్స్ పోస్టర్లను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులన్నారు. వారు డ్రగ్స్ కు ఆకర్షితుల అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.
అధికారులందరూ సమన్వ యంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. ఆయన బుధవారం ధర్మవరం మా ర్కెట్‌యార్డ్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్ స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. గోదాములో ఉన్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించి సరుకుల లభ్యత, పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు.