Share News

TDP టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:40 AM

మండలంలోని నసనకోట సమీపంలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం రాప్తాడు నియోజకవర్గ టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎన్నికల పరిశీలకులు ఆదోని క్రిష్ణమ్మ, మస్తానయాదవ్‌, ఆదినారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు.

TDP  టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక

రామగిరి, జూన 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని నసనకోట సమీపంలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం రాప్తాడు నియోజకవర్గ టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎన్నికల పరిశీలకులు ఆదోని క్రిష్ణమ్మ, మస్తానయాదవ్‌, ఆదినారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు.


వారు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నాయకులతో చర్చించి పార్టీ సంస్థాగత కమిటీలను ఎంపిక చేశారు. కేఎ్‌సఎస్‌, బూత, క్లస్టర్‌, యూనిట్‌ ఇనచార్జిల నియామకం చేపట్టారు. మొత్తం గ్రామ కమిటీలన్నీ ఎంపికయ్యాయి. రామగిరి మండల కన్వీనర్‌గా సుధాకర్‌, ప్రధానకార్యదర్శిగా ఆవుల ముత్యాలప్ప, ఆత్మకూరు మండల అధ్యక్షుడిగా బోయశ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా నరసింహచౌదరి, అనంతపురం రూరల్‌ మండల అధ్యక్షుడిగా జింకా సూర్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా షెక్షావలి నాయుడు, రాప్తాడు మండల అధ్యక్షుడిగా కురుబ పంపు కొండప్ప, ప్రధానకార్యదర్శిగా దగ్గుపాటి శ్రీనివాసులు, కనగానపల్లి మండల అధ్యక్షుడిగా యాతంపోతలయ్య, ప్రధానకార్యదర్శిగా పతకమూరి ఆంజనేయులు, చెన్నేకొత్తపల్లి మండల అధ్యక్షుడిగా ముత్యాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ముత్యాలప్పను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఎల్‌.నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, నెట్టెంవెంకటేశ, నాయకులు సుధాకర్‌చౌదరి, దండు ఓబులేశు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jun 21 , 2025 | 01:41 AM