Home » andhrajyothy
ఆయన మూగజీవాలు, పక్షులఫొటోలు, వీడియోలు తీసి ముచ్చటపడలేదు. వాటి ఆక్రందన, ఆవేదన విన్నాడు... చూశాడు.. చలించాడు.. రాజస్థాన్‌లోని తాల్‌చప్పర్ లోని మెట్టపొలాలు, అటవీప్రాంతాలలో జంతుజాలం దాహం తీర్చేందుకు కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడు.
కనుచూపుమేర నరమానవుడు లేడు.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మంచు కప్పేసింది. ఒళ్లు గగుర్పొడిచే భయానక పర్వత లోయలైన హిమాలయాలు.. పర్వతారోహకులు కష్టపడి ఇంకాస్త ముందుకెళితే.. అక్కడొక ఒంటరి దాబా కనిపిస్తుంది.
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.
సాధారణంగా పిల్లలు బడికి వెళ్లే సమయంలో మారాం చేస్తూ ఏడుస్తుంటారు. అదే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చే సమయంలో అరుస్తూ సంతోషంగా ఉంటారు. అయితే ఈ స్కూలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సాయంత్రం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళుతుంటే ‘ఇక్కడే ఉంటాం’ అంటూ ఏడుస్తుంటారు.
పెళ్లిళ్లకు ఆర్భాటంగా ఖర్చుచేసి, బంధుమిత్రులను ఆహ్వానించడం తెలిసిందే. అయితే ఎదురు డబ్బిచ్చి పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల ట్రెండ్ మొదలయ్యింది. విదేశీ టూరిస్టులు మనదేశంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నట్టే... వివిధ రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలతో జరిగే పెళ్లి వేడుకల్లో పాలుపంచుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు.
కన్నడం వారికి ‘ఉప్పిట్టు’ తెలుగువాళ్ళకు ఉప్పిండి ప్రాచీన వంటకాలు. డి.ఇ.డి.ఆర్. నిఘంటువులో తమిళ ‘ఉవి’ అంటే, ఉడికించటం, ఉవియల్ = ఉడికించిన వంటకం, ఉవళం = ఉడికించిన బియ్యం అని అర్థాలు. తెలుగులో దీన్ని ‘ఉప్పు’ అని పిలుస్తాం. ఉప్పంటే లవణం అనే కాదు, ఉడికించిందనే అర్థం కూడా ఉంది.
పిల్లలు మాట వినట్లేదు... ఇల్లు పీకి పందిరేస్తున్నారు... ప్రతీ తల్లిదండ్రులు చెప్పే మాటలే ఇవి. పిల్లల పెంపకం (పేరెంటింగ్) బ్రహ్మవిద్యగా మారిన రోజులివి. పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు, సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక నవ్య సిద్ధాంతమే ‘ఫఫో’. ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా మారిన ఈ తరహా పేరెంటింగ్ ఏమిటో చూసేద్దాం...
మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్‌ప్లాంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్‌పవర్ ప్లాంట్ పనులు చకచకా జరుగుతున్నాయి.
అంతరించిపోయే జంతుజాలం పట్ల ప్రపంచదేశాలన్నీ ఎంత అప్రమత్తంగా ఉంటున్నాయో చూస్తున్నాం. పుడమితల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలంటే.. ప్రతీ జంతువూ బతకాల్సిందే!. జీవచక్రంలో ఏది అంతరించిపోయినా.. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
నగరాల్లో రోడ్లపైన వాన నీరు ఏరులై పారడం తెలుసు. ఆ వరద కాలువల వల్ల ట్రాఫిక్ జామ్ సంగతి సరే సరి. అలాకాకుండా రోడ్డువారగా అందంగా, నిరంతరం కాలువల్లో పారుతున్న నీటిని ఎప్పుడైనా చూశారా? సాధారణంగా వర్షం పడితే... ప్రవహించే వరద నీటిలో పిల్లలు కాగితం పడవలు వేస్తూ ఆడుకోవడం చూస్తుంటాం.