Living room: ‘లివింగ్’... లవ్లీగా... ఉండాలంటే...
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:25 AM
ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది లివింగ్‌రూమ్‌లోనే. ఇంటికెవరైనా అతిథులు వస్తే కూర్చుండేది ఇక్కడే. ఈ గదిని చూస్తే చాలు... ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో అంచనాకు రావొచ్చు. ఒకవేళ లివింగ్‌రూమ్ చిన్నగా ఉంటే... చిన్న చిన్న మార్పులతో కాస్త పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేసుకోవచ్చు...
ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది లివింగ్‌రూమ్‌లోనే. ఇంటికెవరైనా అతిథులు వస్తే కూర్చుండేది ఇక్కడే. ఈ గదిని చూస్తే చాలు... ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో అంచనాకు రావొచ్చు. ఒకవేళ లివింగ్‌రూమ్ చిన్నగా ఉంటే... చిన్న చిన్న మార్పులతో కాస్త పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేసుకోవచ్చు...
ఎప్పుడైనా సరే లివింగ్‌రూమ్‌లోకి సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. సహజకాంతి గది విశాలంగా కనిపించేలా చేస్తుంది. అలాగే కాంతి ప్రతిబింబించేలా ఒక అద్దం ఏర్పాటు చేసుకున్నా ఫలితం ఉంటుంది.
గది విశాలంగా కనిపించాలంటే గోడలకు లేత రంగులు వేయాలి. లేత రంగులు వెలుతురుని ప్రతిబింపచేస్తాయి. గది విశాలంగా ఉన్నట్టు భ్రమింపజేస్తాయి.

లివింగ్‌రూమ్‌లో ఒక గోడకు ముదురు రంగు వేయడం ద్వారా దృష్టి ఆ వైపే మళ్లేలా చేయవచ్చు.
ఒక గోడకు ముదురు రంగు వేయడం ద్వారా గది భిన్నంగా కనిపిస్తుంది.
గదిలో ఉపయోగంలో లేని వస్తువులు లేకుండా చూసుకోవాలి. స్టాండ్స్, ఫర్నీచర్ వంటివి అమర్చుకుంటే ఫ్లోర్ కనిపించేలా ఉండాలి. దీనివల్ల గది విశాలంగా కనిపిస్తుంది.
ఇంట్లో అందరూ ఎక్కువగా ఉపయోగించే గది ఇది. ఈ గదిలో షెల్ఫ్‌లు, ఫర్నీచర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇవి స్థలాన్ని తగ్గిస్తాయి కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలోనే షెల్ఫ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. ఇన్‌బిల్ట్ ఫర్నీచర్‌ను డిజైన్ చేసుకోవాలి.
లివింగ్‌రూమ్ మధ్యలో ఫోకల్ పాయింట్‌ని గుర్తించాలి. ఖాళీగా ఉన్న గోడ మధ్యలో టీవీ అమర్చాలి. టీవీ చుట్టూ ఖాళీ స్థలం ఉండేలా చూడాలి. ఫ్లోరింగ్‌పై కార్పెట్ వేయాలి. దీనితో గది విశాలంగా కనిపిస్తుంది. గదికి
నాలుగు వైపుల సమానమైన స్థలం వదిలి మధ్యలో కార్పెట్ వేస్తే సూపర్ లుక్ వస్తుంది.
బరువైనవి కాకుండా, తేలికగా ఉండే కర్టెన్లను ఉపయోగించాలి. లేత రంగులు ఎంచుకోవాలి. నేచురల్ సన్‌లైట్ గదిలోకి రాకుండా కర్టెన్లు అడ్డుకోకూడదు. గోడల రంగులు ఏవైతే వేస్తారో అవే రంగు కర్టెన్లు ఉపయోగిస్తే మంచిది.