Home » Andhrajyothi
తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.
వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందజేస్తోంది. ఈక్రమంలోనే పురుగు మందులు పిచికారీ చేయడానికి సబ్సిడీపై డ్రోన్‌లు అందజేసింది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అమ్మాలంటూ ఇద్దర్ని కిడ్నాప్ చేసిన దుండగులు వారిపై దాడి చేశారు.
తిప్పికొడితే టేప్ అంత పొడవు కూడా ఉండడు. కానీ టేప్ భుజాలపై వేసుకుని చకచకా డిజైన్లు గీస్తుం టాడు. ఆ పిల్లోడు సృష్టించిన దుస్తుల కోసం ఏకంగా సెలబ్రిటీలే క్యూ కడుతుంటారు. అమెరికాకు చెందిన తొమ్మిదేళ్ల మ్యాక్స్ అలెంగ్జాండర్ పేరు ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చక్కర్లు కొడుతోంది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారికి... ఒక చిన్న ఆత్మీయ పలకరింపు, ఒక స్పర్శ ఎంతో సాంత్వనను అందిస్తుంది. ఎప్పుడైనా సరే... పెంపుడు జంతువులతో కాసేపు గడిపితే ఒత్తిడి ఇట్టే దూరమై, మనసు తేలికపడుతుందంటారు ఆరోగ్య, మానసిక నిపుణులు.
ఆపద సమయాల్లో ఆత్మరక్షణకు... గర్భిణులు సాఫీగా నిద్రపోయేందుకు... ఆఫీసులో గంటల తరబడి కూర్చున్నా, పాదాలు వాపు రాకుండా ఉండేందుకు... ఇలాంటి కొన్ని మహిళకు సంబంధించిన సమస్యలకు, పరిష్కారాన్ని చూపే ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి.
పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.