Home » Ananthapuram
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు.
కోడి కత్తితో యువకుడిని హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన లింగమయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. రైతులు ఖరీఫ్, రబీ సీజన్‌లో వివిధ రకాలైన కూరగాయలు, ఉద్యాన పంటలతోపాటు పూల సాగుపై మక్కువ చూపుతున్నారు.
పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.
పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.
అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం ఆందోళనకు దారితీసింది. కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.