డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:31 AM
డ్రగ్స్, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఎస్పీ జగదీ్‌షతో కలిసి మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు-అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్బీఓఆర్డీ(నార్కో కోఆర్డినేషన సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా కోసం ..
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఎస్పీ జగదీ్‌షతో కలిసి మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు-అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్బీఓఆర్డీ(నార్కో కోఆర్డినేషన సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ... విద్యార్థులు, ప్రజల్లో ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972, క్యూఆర్ కోడ్ గురించి, డ్రగ్స్, గంజాయి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డీ-అడిక్షన సెంటర్, ప్రిజన వార్డ్‌లను బలంగా ఏర్పాటు చేయాలని, డ్రగ్ వ్యసన బాధితుల పునరావాసానికి సమర్థవంతంగా పనిచేయాలని డీఎంహెచఓ, జీజీహెచ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీ అధికారులు తమ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూడాలని సూచించారు. వాహనాల తనిఖీలను మరింత బలోపేతం చేసి, డ్రగ్స్, గంజాయి రవాణాను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని డీటీసీని ఆదేశించారు.
రోడ్డు భద్రత కోసం పటిష్ట చర్యలు
జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, నగరపాలక సంస్థ, ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. గుత్తి-గుంతకల్లు రోడ్డులోని రోడ్, ఆర్‌ఓబీని, రాప్తాడు వద్ద రైల్వే లైన ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో గుర్తించిన స్థలాల్లోనే బస్సులు నిలిపేలా మున్సిపల్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుని ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎనఐసీ వారు అభివృద్ది చేసిన ఐరాడ్ యాప్‌లో సీహెచసీ, ఏరియా ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు. నగరంలోని తపోవనం బైపాస్ వద్ద జాతీయ రహదారిలో స్ర్టీట్ లైట్లను టౌన డీఎస్పీతో సమన్వయం చేసుకుని నేషనల్ హైవే వారు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, డీటీసీ వీర్రాజు, నేషనల్ హైవే పీడీ తరుణ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామమోహనరెడ్డి, డీఎంహెచఓ ఈబీ దేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ అర్చన, నగర కమిషనర్ బాలస్వామి, డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.