Home » Amaravati farmers
అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు.
రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు.
ప్రపంచంలో తెలుగువారంతా గర్వించే నగరం అమరావతి అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కావాలన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంబరాలతో హోరెత్తించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతి రైతులకు ఈనెల 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించనున్నారు.
అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు..
అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.