Home » Akhilesh Yadav
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ , కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్‌లో ఫైనల్‌గా కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది.
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ లో అడుగుపెడుతున్న వేళ సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ యాత్రలో పాల్గొంటారా అనే సస్పెన్స్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఖరారైతేనే యాత్రలో పాల్గొనాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం.
సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల దృష్టి ఆ 120 నియోజకవర్గాల మీదే పడిందా. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు.