Share News

Ayodhya: దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పడు వెళ్తా: అఖిలేష్

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:12 PM

అయోధ్యలో రామాలయం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న జరగనుండటంతో యూపీ ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) మాత్రం ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆలయానికి వెళ్తానని ఆయన తెలిపారు.

Ayodhya: దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పడు వెళ్తా: అఖిలేష్

లక్నో: అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Temple) ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న జరగనుండటంతో యూపీ ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) మాత్రం ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆహ్వానిస్తే అయోధ్య కార్యక్రమానికి వెళ్తామని ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) భార్య డింపుల్ యాదవ్ చెప్పగా, అఖిలేష్ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆలయానికి వెళ్తానని ఆయన తెలిపారు.


''దేవుడు ఎప్పుడు పిలిస్తే, అప్పుడే వెళ్లి పూజలు జరపాలని మా పూర్వీకులు, కమ్యూనిటీ ప్రజలు నమ్ముతారు'' అని అఖిలేష్ లక్నోలో మీడియాతో శనివారంనాడు మాట్లాడుతూ చెప్పారు. కాగా, 22వ తేదీన జరిగే కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అనే విషయంలో సమాజ్‌వాదీ పార్టీ సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌పీకి గణనీయంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ విషయం తేటతెల్లమైందని, ఆ వర్గానికి ఆగ్రహం కలిగించాలని సమాజ్‌వాదీ పార్టీ అనుకోవడం లేదని వారు చెబుతున్నారు. కాగా, మాజీ సీఎం అఖిలేష్‌ను ఆహ్వానించారా లేదా అనే విషయంపై శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టు సైతం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Updated Date - Dec 30 , 2023 | 09:12 PM