Home » Akhilesh Yadav
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ రాజకీయంగా ఎటు వైపుగా అడుగులేస్తోందో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వైఖరే అందుకు కారణం. అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా అనుసరిస్తున్న వ్యూహం ఏంటో అంతుచిక్కని పరిస్థితి.
యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి ప్రగతి భవన్‌కు అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు.
విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)కు గట్టి షాక్ తగిలింది. ఆయన మిత్ర పక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)కు మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది.
యూపీలోని బల్లియా జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 54 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ మరణాలకు గల కారణాలపై అధికారులు భిన్న వివరణలు ఇచ్చారు. తూర్పు ఉత్తరపరదేశ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు ఈ మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇన్‌చార్జ్, లక్నోకు చెందిన సీనియర్ ప్రభుత్వ వైద్యుడు ఏకే సింగ్.. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమనే విషయాన్ని తోసిపుచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఓ ప్రత్యేక ఫార్ములాను రూపొందించారు.
అధికార మార్పిడికి గుర్తుగా నిలిచే చరిత్రాత్మక రాజదండాన్ని నూతన పార్లమెంటు భవనంలో అమర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నాయకురాలు మనేకా గాంధీ గాయపడ్డారు.
నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలుసుకున్నారు.
నితీశ్ కుమార్ (JDU chief Nitish Kumar) ఏప్రిల్ 24న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను లక్నోలో కలుసుకోనున్నారు.