Home » Actor
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. 'స్టయిల్', 'ఎక్స్యూజ్ మీ' వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.
చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు.
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ ధీమాతో ఉంది. ఈ సారి 400 సీట్లు గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది. పలు వేదికల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీ, బీజేపీ పేరు ఎత్తకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ టెలివిజన్ షోలలో ఒకటైన సీఐడీ ఫేం దినేశ్ ఫడ్నీస్ సోమవారం మృతి చెందారు. 57 సంవత్సరాల వయసున్న ఈయన కొంతకాలంగా...
కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పై ఉన్న జంటను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయన కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వసంతనగర్ మెయిన్ రోడ్డుకు సమీపంలో వాకింగ్ చేస్తున్న జంటను ఢీకొంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వర్దమాన సినీ, టెలివిజన్ నటుడు నితిన్ గోపీ శనివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. 39 ఏళ్ల నితిన్ గోపీ కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ 'హల్లో డాడీ' చిత్రంలో బాలనటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.