Sandalwood Industry: కన్నడ స్టార్ నటుడు హఠాన్మరణం

ABN , First Publish Date - 2023-06-03T20:02:44+05:30 IST

కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వర్దమాన సినీ, టెలివిజన్ నటుడు నితిన్ గోపీ శనివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. 39 ఏళ్ల నితిన్ గోపీ కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ 'హల్లో డాడీ' చిత్రంలో బాలనటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.

Sandalwood Industry: కన్నడ స్టార్ నటుడు హఠాన్మరణం

బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమ(Kannada Film Industry)లో మరో విషాదం చోటుచేసుకుంది. వర్దమాన సినీ, టెలివిజన్ నటుడు నితిన్ గోపీ (Nitin Gopi) శనివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. 39 ఏళ్ల నితిన్ గోపీ కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ 'హల్లో డాడీ' చిత్రంలో బాలనటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం నితిన్ గోపీని ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సకు ఆయన స్పందించలేదు. దీంతో వైద్యులు ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు. నితిన్ గోపి హఠాన్మరణంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాలు వెల్లువెత్తాయి. నితిన్ గోపీ ఇంకా వివాహం చేసుకోకపోవడంతో బెంగళూరులోని తన తల్లిదండ్రుల వద్దే ఆయన ఉంటున్నారు.

కన్నడ చిత్రాలు, టెలివిజన్ షోలతో నితిన్ గోపీ మంచి పేరు తెచ్చుకున్నారు. శృతినాయుడు నిర్మించిన 'పునర్ వివాహ' సీరియల్‌తో ఆయన బాగా పాపులర్ అయ్యాయి. 'హరహర మహదేవ' భక్తి రసాత్మక సీరియర్‌తో పాటు పలు తమిళ సీరియల్స్‌ కూడా ఆయన నటించారు. తాజాగా ఆయన ఓ సీరియల్‌కు దర్శకత్వం వహించాలనే ఆలోచనతో ప్రముఖ కన్నడ ఛానెల్‌తో చర్చలు కూడా సాగించారు. ఆయన కేరళిడ కేసరి, నిశ్సబ్ద, చిరబాందవ్య తదితర సినిమాల్లోనూ నితిన్ నటించారు.

పలువురు సంతాపం...

చిన్న వయస్సులోనే నితిన్ కన్నుమూయడంపై పలువురు కన్నడ సినీ ప్రముఖలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పునీత్ రాజ్‌కుమార్, లక్ష్మణ్, మన్‌దాప్ రాయ్, బుల్లెట్ ప్రకాష్ వంటి పలువురు ప్రముఖ నటులను శాండిల్‌వుడ్ పరిశ్రమ కోల్పోయింది.

Updated Date - 2023-06-03T20:06:37+05:30 IST