Home » ACB
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి రూ.76 వేల టీఏ బిల్లు రావాల్సి ఉంది.
కాలేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ హరి రామ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని ఐదు రోజుల పాటు విచారించనున్నారు.
గొర్రెల స్కామ్‌లో కేసు నమోదు అయినప్పటి నుండి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరూ పరరీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కీమును స్కామ్‌గా మర్చి రూ. 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
Gopi ACB Custody: మాజీ మంత్రి విడుదల రజిని మరిది విడుదల గోపిని రెండో రోజు ఏసీబీ అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. ఈరోజు విచారణలో మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
ఎసీబీ విచారణలో భాగంగా, విడదల రజిని మరిది గోపి పేర్కొన్నాడు, వదిన చెప్పిన తర్వాతే స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడానని. 2.2 కోట్లు వసూలు చేసి బెదిరించారని తెలిపాడు
Vidudala Gopi ACB custody: మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గోపినీ ఏసీబీ ప్రశ్నించనుంది.
ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్‌రెడ్డి పై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి, విచారణకు సహకరిస్తామని తెలిపాడు
ఏసీబీ అధికారాల సమాచారం ప్రకారం, ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అసోసియేటెడ్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సిసోడియా, జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మార్చిలో ఆమోదం తెలిపారు.
రిమాండ్‌లో ఉన్న ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.