Share News

KTR: బ్రేకింగ్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ABN , Publish Date - May 26 , 2025 | 09:05 PM

KTR: మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

KTR: బ్రేకింగ్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
KTR

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ‘ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, ఏసీబీ ఖచ్చితంగా సహకరిస్తాను. యూకే, యూఎస్ వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. కార్యక్రమాల కోసం బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి, నేను తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతాను’ అని అన్నారు.


కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై హరీష్ రావు స్పందిస్తూ.. ‘ ఇవి రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేవు. మేము కేటీఆర్‌కు మద్దతుగా ఉంటాం. సత్యమేవ జయతే’ అని అన్నారు.

కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. ‘ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది’ అని అన్నారు.


కాగా, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ గతంలో ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఆయన్ను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఈ కార్‌ రేసు నిర్వాహణకు సంబంధించి రూ.55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. అలాగే కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

TDP Mahanadu 2025: కొత్త చరిత్రకు నాంది.. కడప మహానాడుపై లోకేష్ మార్క్

Kolipalya Gang: ఇంటి బయట న్యూస్ పేపర్ కనిపించిందా.. ఇళ్లు నాశనం చేస్తారు..

Updated Date - May 26 , 2025 | 09:39 PM