Home » ABN Andhrajyothy
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని స్పందన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిని చెన్నెకొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజాపూర్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 20కి పెరిగింది.
శాస్త్ర సాంకేతిక రంగం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేన్నైనా ఇట్టే నేర్చేసుకుంటున్నారు నేటి ప్రజలు. అయితే.. మరికొందరు వీటిని పెడదారి పట్టిస్తూ.. వినాశనానికి కారకులవుతున్నారు. ఈ సంగతంతా ఇప్పుడెందుకంటరా.. ఈ కథనం చదవండి... మీకే తెలుస్తుంది.
కేరళలోని కొట్టాయం ప్రాంతంలో అంతర్రాష్ట్ర బస్సులో తరలిస్తున్న రూ.72 లక్షలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏపీకి చెందిన షేక్ జాఫర్, పాషాస్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా.. రైలు ఢీ కొట్టింది.
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు చేతిలో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
టీమిండియా యంగ్ ప్లేయర్ రుతరాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. రాయ్ పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ శతకంతో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు.
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుసగా మూడుసార్లు పార్టీ పదవుల్లో ఉన్న వారిని తప్పించి.. యువతకు అవకాశం కల్పిస్తుంది. దీంతో పార్టీలో కొత్త రక్తం ప్రవహిస్తోంది.
తన పెళ్లికి వచ్చిన ఓ మహిళా అతిథిని పెళ్లి కూతురు కాపాడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ వధువుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.