Share News

Class 12 Teen Hacks CCTV: సీసీటీవీని హ్యాక్ చేసిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ABN , Publish Date - Dec 03 , 2025 | 07:53 PM

శాస్త్ర సాంకేతిక రంగం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేన్నైనా ఇట్టే నేర్చేసుకుంటున్నారు నేటి ప్రజలు. అయితే.. మరికొందరు వీటిని పెడదారి పట్టిస్తూ.. వినాశనానికి కారకులవుతున్నారు. ఈ సంగతంతా ఇప్పుడెందుకంటరా.. ఈ కథనం చదవండి... మీకే తెలుస్తుంది.

Class 12 Teen Hacks CCTV: సీసీటీవీని హ్యాక్ చేసిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Hacks CCTV To Get Update On Girlfriend

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులంటే చిన్న చిన్న తుంటరి పనులు చేయడం సహజం. కానీ, ఓ కుర్రాడు మాత్రం ఏకంగా సీసీటీవీ కెమెరానే హ్యాక్ చేసేశాడు(Intermediate Student Hacked CCTV). విషయం తెలిశాక.. ఎందుకు ఇలా చేశావని ఆరా తీస్తే.. ఆ విద్యార్థి చెప్పిన సమాధానం విని షాకయ్యారు అక్కడివారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అబ్బాయి చేసిన పనిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు అతను సీసీటీవీ హ్యాక్ చేశాడు.? దొరికిపోయాక ఏమన్నాడంటే..?


అస్సాం(Assam) రాష్ట్రంలోని శ్రీభూమి(Sribhumi) జిల్లాకు చెందిన ఓ ఇంటర్మీడియట్ స్టూడెంట్(Inter Student).. ఓ ఇంటి భవనానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాను హ్యాక్ చేశాడు(Hacked CCTV). ఆ ఇల్లు అతడి స్నేహితురాలిది(Girl Friend). హ్యాక్ చేసిన ఆ సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను తన మొబైల్‌కు కనెక్ట్ చేసుకుని చూస్తున్నాడు. అలా పరిశీలిస్తూ.. ఆ పరిసర ప్రాంతంలోనే అటూ ఇటూ తిరుగుతూ ఉండగా.. స్థానికులకు అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు. అతడి మొబైల్ ‌ఫోన్‌నూ తనిఖీ చేసి.. అసలు విషయాన్ని పసిగట్టారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. తన స్నేహితురాలు ఏం చేస్తోందోనని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకే తానిలా చేశానని పోలీసులకు తెలిపాడు. అయితే.. అతను ఎలా యాక్సెస్ చేశాడనే వివరాలేవీ ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడు మైనర్ కాబట్టి జువైనల్ జస్టిస్ యాక్ట్(Care and Protection of Children)-2015 కింద విచారణ సాగిస్తున్నారు.


ఈ విషయం నెట్టింట వైరల్(Viral in Internet) కాగా.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సీసీటీవీ పాస్‌వర్డ్‌లను డీఫాల్ట్‌గా ఉంచకుండా తరచూ మారుస్తూ ఉండాలని, సింపుల్‌‌గా కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను మెయింటైన్ చేయాలని కామెంట్ల ద్వారా సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

చిక్కుల్లో ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ బిడ్డర్.. ఏమైందంటే.?

ఊళ్లో కోతులను తరిమాకే ఓట్లగండి.. రేగొండ ప్రజల బహిరంగ పోస్టర్

Updated Date - Dec 04 , 2025 | 12:52 PM