Home » ABN Andhrajyothy
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.
భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఝార్ఖండ్, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అంటే చూడగానే ప్రేమలో పడిపోవడం. అలా ప్రేమించిన వారికి వినూత్న రీతిలో ప్రపోజ్ చేసేందుకు యత్నిస్తుంటారు కొందరు. ఆ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోవాలని ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు. అలాంటి కొన్ని ప్రపోజల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఆ రకమైన స్పెషల్ ప్రపోజల్ ఒకటి మీకోసం...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యాయి.
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.
మాసాల్లో మార్గశిరాన్ని నేనంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పారు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉందో.. మార్గశిరానికి సైతం అంతే విశిష్టత ఉంది. అలాంటి మార్గశిర మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాక ఆమె శవంతో సెల్ఫీ దిగి..వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.