Home » ABN Andhrajyothy Effect
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గల హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.
డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఖైరా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్ జట్టు లాహోర్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ 6 సిక్సులు, 5 ఫోర్లతో 57 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డులను బద్దలు కొట్టాడు.
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డును చేరుకున్నాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన వన్డే కెరీర్‌లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక ఎలాక్ట్రానిక్ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనలేని వారికి బిగ్ బిలియన్ డేస్ సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
ఈ నెల 27న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం గెలిచారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 19 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురువేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. కానీ అప్పుడే అమెరికాలో తదుపరి అధ్యక్షడు ఎవరనే సర్వేలు ఊపందుకున్నాయి.