ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో సవాళ్లు విసిరిన ఆ పార్టీ సీనియర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడా.. ఎవరి మాటా.. వినిపించడం లేదు. అయితే ప్రచారం సమయంలో అతికి పోయి సవాల్ చేసిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు.
21 రోజులపాటు వేచిచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే తరువాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు (బుధవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్‌లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఆంధప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమాన్ మీనా (Mukesh Kumar Meena) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.
AP Assembly Exit Polls 2024 Live Updates: 153 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. తగ్గేదేలే.. కచ్చితంగా అధికారం తమదేనని కూటమి నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనాల నాడిని అంచనా వేసిన పలు పోల్ సంస్థలు, సర్వే ఏజెన్సీలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షరతు ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి.
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.
లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Election 2024) చివరిదైనా ఏడవ దశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న (శనివారం) పోలింగ్ జరగనుంది.