కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు అమిత్‌షా చెప్పారు. అయితే ఆ రెండు సీట్లూ ఖాళీగా లేవని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఆర్జేడీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అయితే కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి మరీ సీఎం పోస్ట్‌ను ఆర్జేడీ చోరీ చేసిందని అన్నారు.
పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్‌లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.
మాజీ మంత్రి కేటీఆర్.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
బిహార్‌లో తగినంత వర్క్‌ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.
దేశాభివృద్ధిలో బిహార్ పాత్ర ఎంతో ఉందని, కానీ బిహార్‌లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రియాంక గాంధీ అన్నారు. బిహార్ పాలకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
రాష్ట్రీయ జనతాదళ్‌పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని నితీష్ చెప్పారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్‌పీ కార్తికేయ కె.శర్మ తెలిపారు.