తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:01 AM
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 31: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. ఈ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరి ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని వివరించింది. అదే విధంగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఈ రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది.
హైదరాబాద్ మహానగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్య
బాకరాపేట ఘాట్‌రోడ్డులో లారీ దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్